‘ఇష్క్’ సినిమా విజయం తరువాత యంగ్ హీరో నితిన్ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఒమన్లో కొన్ని అందమైన ప్రదేశాలలో ఒక పాటను చిత్రీకరించారు.
నిత్యా మీనన్ ఈ సినిమాతో రెండోసారి నితిన్ కి జోడిగా నటించనుంది. శ్రేష్ట మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకుడు.
ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియో మార్చ్ లో విడుదల కానుంది. చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు