యంగ్ హీరో నితిన్ నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఫస్ట్ లుక్ ఈ నెల 28న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకి నితిన్ డబ్బింగ్ చెబుతున్నాడు. ప్రేమ్ సాయి డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని ప్రముఖ డైరెక్టర్ గౌతం మీనన్ డైరెక్ట్ చేస్తున్నాడు. యామి గౌతం హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని ఆశిస్తున్నారు.
‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో వరుస హిట్స్ అందుకొని నితిన్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ప్రస్తుతం నితిన్ పూరి జగన్నాథ్ ‘హార్ట్ అటాక్’ సినిమాతో బిజీ గా ఉన్నాడు.