లేటెస్ట్ గా “భీష్మ” సినిమాతో మంచి కం బ్యాక్ హిట్ అందుకున్న నితిన్ ఇప్పుడు అదే హిట్ ట్రాక్ ను కొనసాగించేలాని అంతే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడు. మరి అలా తాను టేక్ చేరిన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు మేర్లపాక గాంధీతో ప్లాన్ చేసిన బాలీవుడ్ భారీ హిట్ చిత్రం “అంధదూన్” కూడా ఒకటి. ఇది రీమేక్ అయ్యినప్పటికీ కూడా సాలిడ్ స్క్రిప్ట్ కావడంతో దీనిపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
అందుకు తగ్గట్టుగానే కొన్నాళ్లుగా మంచి బజ్ ఇంట్రెస్టింగ్ గాసిప్స్ వినిపిస్తున్న ఈ చిత్రంపై ఇప్పుడు ఒక ఫైనల్ క్లారిటీ వచ్చేసింది. తమన్నా మరియు నభా నటేష్ లు ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే జూన్ 11న విడుదల చేసేందుకు డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేసేసారు. ఇక అలాగే ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో రాధికా ఆప్టే నటిస్తుండగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నే ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు. హిందీ బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించిన ఈ చిత్రం తెలుగులో ఎలా ఉంటుందో చూడాలి మరి.