ప్చ్..”నిశ్శబ్దం” కూడా బ్రేక్ చెయ్యలేకపోయింది.!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక భాగంగా మారిపోయిన ఓటిటి రిలీజ్ ల పరంపర కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకపక్క ఇలా కొత్త సినిమాలు అన్నీ డిజిటల్ రిలీజ్ తో వచ్చేస్తున్నాయని ఓ వర్గం ఆనందపడుతున్నా అవి ఏమాత్రం అంచనాలను అందుకోకపోవడం మరింత విచారకరం.

మన దక్షిణాది ఇండస్ట్రీల నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కేవలం యంగ్ టాలెంట్ క్లిక్ అయ్యింది తప్ప స్టార్ మరియు సీనియర్ క్యాస్టింగ్ ఉన్న సినిమాలు అస్సలు అంచనాలను అందుకోలేకపోయాయి. ముఖ్యంగా ఈ రిలీజ్ లలో ఎక్కువగా వచ్చినవి మంచి సస్పెన్స్ లేదా క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రాలే..

వాటిలో ఇప్పటికే “పెంగ్విన్” మరియు “వి” చిత్రాలు ఎలాంటి హైప్ తో వచ్చి ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయి చూసాము. కానీ వీటిని అనుష్క మెయిన్ లీడ్ లో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్న రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్ అయ్యింది.

దీనితో ముందు వాటి తరహాలోనే ఈ చిత్రం కూడా అనిపించడంతో ఈ సినిమా అయినా వాటి ఫలితాన్ని బ్రేక్ చేసి కొత్తగా ఉంటుంది అనుకుంటే ఆడియెన్స్ ఈ సినిమా చూసాక పెదవి విరిచేసారు. దీనితో ఈ చిత్రం కూడా బ్రేక్ ఇవ్వని చిత్రంగా మిగిలిపోయింది.

Exit mobile version