అనౌన్స్మెంట్ కు రెడీ అవుతున్న అనుష్క సినిమా?

అనౌన్స్మెంట్ కు రెడీ అవుతున్న అనుష్క సినిమా?

Published on Aug 26, 2020 7:35 PM IST

ప్రస్తుతం ఊహించని విధంగా నెలకొన్న పరిస్థితుల రీత్యా అనేక సినిమాలు నేరుగా ఓటిటిలోనే విడుదల కాబడుతున్నాయి. అయితే ఈ విడుదలకు ముందు మన టాలీవుడ్ చిత్రాలు దూరంగానే ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం మన దగ్గర కూడా డిజిటల్ రిలీజ్ లు మొదలయ్యాయి. చిన్న బడ్జెట్ సినిమాల నుంచి ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాల విడుదల వరకు ఈ పరంపర వచ్చింది.

అందులో భాగంగా నాని నటించిన లేటెస్ట్ చిత్రం “వి” విడుదలకు సిద్ధంగా ఉండగా దీని తర్వాత కూడా మరిన్ని సినిమాలు రానున్నాయని ఖరారు అయ్యింది. అయితే వాటిలో మోస్ట్ వాంటెడ్ సినిమా అయినటువంటి “నిశ్శబ్దం” కూడా ఒకటి. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కానీ కరోనా వల్ల ఈ చిత్రం విడుదల ఆగిపోవాల్సి వచ్చింది.

ఇక మన దగ్గర కూడా డిజిటల్ రిలీజ్ పర్వం మొదలు కావడంతో నిశ్శబ్దం కూడా రానుంది అన్నట్టుగా రచయిత కోన వెంకట్ హింట్ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి మళ్ళీ ఈ సినిమా కోసం మళ్ళీ ఏ వార్తా వినిపించలేదు. కానీ ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు సంబంధించి ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. మరి మేకర్స్ ఏం చెప్తారో కానీ ఈ చిత్రం కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు