చైతు కొత్త సినిమా హర్రర్ థ్రిల్లర్ అట !

చైతు కొత్త సినిమా హర్రర్ థ్రిల్లర్ అట !

Published on Aug 24, 2020 12:00 AM IST

డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీసి.. అక్కినేని ఫ్యామిలీకి గొప్ప సినిమా ఇచ్చాడు. అలాగే అఖిల్ హీరోగా ‘హలో’ అంటూ అఖిల్ కి హిట్ ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. ఇక ఈ సారి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగ‌చైత‌న్యతో ఓ సినిమాని తెర‌కెక్కించబోతున్నాడు. కాగా ఈ సినిమా ఒక హర్రర్ థ్రిల్లర్ లా ఉండబోతుందని.. అలాగే చైతుతో చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాలో రొమాన్స్ మరియు కామెడీ కూడా ఫుల్ గా ఉంటుందట.

ఇక ఈ సినిమా పై రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. లేనిపోని రాతలతో మేకర్స్ కి కూడా చిరాకు పుట్టిస్తున్నారు రూమర్ల క్రియేటర్స్. అయితే ఈ సినిమా పై సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ అన్ని ఫేక్. ఇక లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇప్పటికే షూట్ కు అవసరమైన సెట్స్ ను కూడా మేకర్స్ నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి చైతుకి విక్రమ్ ఈ సారి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

తాజా వార్తలు