బాక్సాఫీస్ లెక్కలతో యుద్ధం చేయబోతున్న ‘వార్ 2’.. బ్రేక్ ఈవెన్ మార్క్ ఫిక్స్!

బాక్సాఫీస్ లెక్కలతో యుద్ధం చేయబోతున్న ‘వార్ 2’.. బ్రేక్ ఈవెన్ మార్క్ ఫిక్స్!

Published on Jul 28, 2025 1:32 PM IST

War2

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమాను మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర టార్గెట్ కూడా భారీగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఏకంగా రూ. 600 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించాల్సింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ.800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది.

కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఎంతవరకు అందుకుంటుందో చెప్పలేం. ఇక ఈ చిత్రానికి పోటీగా రజినీకాంత్ కూలీ కూడా ఉండటంతో ఈ చిత్ర కలెక్షన్స్‌పై కొంత ప్రభావం పడటం ఖాయమని సినీ క్రిటిక్స్ అంటున్నారు. దీంతో వార్ 2 చిత్రం బాక్సాఫీస్ లెక్కలతో గట్టి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు