కొత్త ట్రెండ్: “మా స్టొరీ కాపీ కాదండోయ్..”

కొత్త ట్రెండ్: “మా స్టొరీ కాపీ కాదండోయ్..”

Published on Mar 2, 2013 3:00 PM IST

ప్రపంచంలో కొత్తదనం చాల తక్కువ. ఉన్న వనరులనే మరో విధంగా చూపించడం నేటి తరం స్టైల్. ఈ ప్రక్రియ సినీ వర్గాలకు కుడా వర్తిస్తుంది. తీసుకున్న కధ పాతదే అయినా దానికి క్రియేటివ్ కధనాన్ని జోడించి హిట్లు కొట్టేస్తున్నారు. ‘డీ’, ‘రెడీ’, ‘దేనికైనా రెడీ’ ఈ సినిమాలన్నిటికీ మూల కథ ఒకటే. హీరో విలన్ ఇంట్లో తిష్ట వేసి వాళ్ళని ఏడిపిస్తూ మనల్ని నవ్వించడం. అలాగే ‘ఇంద్ర’, ‘సమరసింహా రెడ్డి’ లాంటి చిత్రాల ఫ్లాష్ బ్యాక్ కధాంశం అప్పట్లో సంచలనం సృష్టించిన ‘భాషా’ బ్యాక్ డ్రాప్ నుండి తీస్కున్నవే.

అయితే ఇప్పుడు వచ్చే అన్ని సినిమాల బృందాలు మావి కాపి కథలు కావు అంటున్నారు. మొన్న వారం విడుదలైన ‘జబర్దస్త్’ సినిమా ‘బ్యాండ్ బజా భారత్’ సినిమాను తలపించగా అది మాత్రం తన సొంత కథే అని చిత్ర దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పింది. ‘గ్రీకువీరుడు’ తెలుగుతనం కలిగిన సొంత కధ అని నాగార్జున అనగా, ‘బాద్ షా’ స్టొరీ పక్క ఓన్ స్క్రిప్ట్ అని రచయితలు చెప్తున్నారు. చూద్దాం మనవాళ్ళు ఎంత కొత్తగా కధను అల్లుతారొ .

తాజా వార్తలు