మరో ఎనిమిది నెలల వరకు సినిమా లేదంటున్న టాప్ డైరెక్టర్

మరో ఎనిమిది నెలల వరకు సినిమా లేదంటున్న టాప్ డైరెక్టర్

Published on Oct 5, 2012 12:00 PM IST


‘గుజారిష్’ సినిమాతో సినిమాలకు దూరమైన ఇండియన్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ఆరాధ్య అనే పాపకి జన్మనిచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా కెమెరాకి దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్ ఇటీవలే ఒక జ్యువెలరీ యాడ్లో కనిపించారు. అలా కనిపించిన ఐష్ పై కొద్ది రోజులుగా సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ మణిరత్నం తీయబోయే సినిమాతో ఐశ్వర్య రాయ్ రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తపై మణిరత్నం గారి భార్య సుహాసిని మణిరత్నం స్పందించారు. ఆమె మాట్లాడుతూ ‘ ఐష్ – మణిరత్నం సినిమా పై వస్తున్న వార్తలను నమ్మకండి. ఎవరో ఆకతాయిలు కావాలనే ఆ వార్తని సృష్టించారు. ప్రస్తుతం మణిరత్నం తీస్తున్న ‘కడల్’ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. చిత్రీకరణ పూర్తవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ అవుతారు. ఈ చిత్రం పూర్తి చేసి, మరో కథ రాసుకుని సినిమా మొదలు పెట్టడానికి కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది, కావున అప్పటి వరకూ మణిరత్నం సినిమాల గురించి వచ్చే వార్తలని నమ్మకండని’ ఆమె అన్నారు. ప్రస్తుతం మణిరత్నం తీస్తున్న ‘కడల్’ సినిమా ‘కడలి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది.

తాజా వార్తలు