ఆఫీషియల్: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “ఓజి”

ఆఫీషియల్: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “ఓజి”

Published on Oct 18, 2025 12:07 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ వసూళ్లు అందుకొని పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా ఈ ఏడాదికి తెలుగు సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు క్రేజీ న్యూస్ అఫీషియల్ గా బయటకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరు పాన్ ఇండియా అఫీషియల్ డేట్ ని అయితే ఇచ్చేసారు. మరి దీనితో ఈ సినిమా ఈ అక్టోబర్ 23న ఓటీటీ లో అలరించేందుకు వస్తున్నట్టు ఖరారు అయ్యింది. ఇక ఓటీటీలో వచ్చాక ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

తాజా వార్తలు