‘శ్రీ రామరాజ్యం’ సినిమా ఆతర్వాత సినిమాలకు స్వస్తి చెప్పేస్తాను అన్న నయనతార కొంత విరామం తర్వాతా టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది మరియు సౌత్ ఇండియన్ అన్ని భాషల్లోనూ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. 30 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్క హీరో పక్కన నయనతార చాలా చక్కగా సరిపోతుంది. ప్రస్తుతం నయనతార తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం నిర్మాత తనకి 1 కోటి 25 లక్షల పారితోషికం ఇస్తే కానీ తన కాల్షీట్లను ఇవ్వడానికి ఆలోచించడం లేదు.
తన పారితోషికంలో మార్పులు చేసుకున్నట్టుగానే సినిమా ఒప్పుకున్నాక దానికి సినిమాకి తగ్గట్టు ఏమి కావాలన్నా చేస్తోంది. ఉదాహరణకి సినిమాని తొందరగా పూర్తి చేయాలి అనుకున్న వారికి అనుగుణంగానే కాల్షీట్లు ఇచ్చి సినిమా పూర్తి చేస్తోంది. అదే కోవలోనే రానా సరసన చేసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాని పూర్తి చేసారు. ప్రస్తుతం నాగార్జునతో ‘లవ్ స్టొరీ’ సినిమాలో నటిస్తోంది, అలాగే తమిళంలో అజిత్ సరసన ఓ సినిమా చేస్తున్నారు. బహుశా జీవితం నేర్పిన అనుభవాలు నయనతార మీద ఇలా పనిచేస్తున్నట్టు ఉంది.