ఒకే రోజు ఓకే ఓటిటిలో నవీన్ చంద్ర రెండు రీసెంట్ థ్రిల్లర్స్!

ఒకే రోజు ఓకే ఓటిటిలో నవీన్ చంద్ర రెండు రీసెంట్ థ్రిల్లర్స్!

Published on Jun 13, 2025 12:07 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నవీన్ చంద్ర కూడా ఒకరు. కేవలం హీరో గానే కాకుండా సాలిడ్ పాత్రల్లో ఇతర సినిమాల్లో కూడా తాను నటిస్తున్నాడు. అలా ఈ ఏడాదిలో ఆల్రెడీ తన నుంచి హీరోగా మూడు సినిమాలు విడుదలకి గత మూడు నెలల్లోనే వచ్చాయి. అయితే వాటిలో రెండు చిత్రాలు లేటెస్ట్ గా ఈ ఒక్క రోజే అది కూడా ఒకే ఓటిటి ప్లాట్ ఫామ్ లో రావడం విశేషం.

దర్శకుడు రాకేష్ వర్మ తెరకెక్కించిన ఇన్వెస్టిగేషన్ మర్డర్ థ్రిల్లర్ బ్లైండ్ స్పాట్ అలాగే లోకేష్ అజల్స్ తెరకెక్కించిన మరో థ్రిల్లర్ లెవెన్ చిత్రాలు నేడు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. మరి ఈ రెండు సినిమాలని కూడా ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారే సొంతం చేసుకున్నారు. కాగా ఇవాళ్టి నుంచే అందుబాటులోకి తీసుకొచ్చేసారు. ఇక ఈ సినిమాల్లో లెవెన్ పాన్ సౌత్ భాషల్లో అందుబాటులో ఉంది.

బ్లైండ్ స్పాట్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

లెవెన్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు