డ్యూడ్.. అక్కడ ఇంకా స్ట్రాంగ్‌..!

డ్యూడ్.. అక్కడ ఇంకా స్ట్రాంగ్‌..!

Published on Oct 25, 2025 12:03 AM IST

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘డ్యూడ్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటుతోంది.

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ బాక్సాఫీస్‌లోనూ సాలిడ్ రన్ కంటిన్యూ అవుతోంది. ఈ చిత్రం నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర 700K డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ వీకెండ్ వేరే సినిమాల సందడి లేకపోవడంతో, డ్యూడ్‌కు మరింత కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటించగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

తాజా వార్తలు