సైన్స్ ఫిక్షన్‌పై కన్నేసి ‘డ్యూడ్’ హీరో..?

సైన్స్ ఫిక్షన్‌పై కన్నేసి ‘డ్యూడ్’ హీరో..?

Published on Oct 25, 2025 2:03 AM IST

యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది సౌత్ సినిమా గా మారాడు. ఆయన నటించిన బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా వంద కోట్ల కలెక్షన్స్‌తో దుమ్ములేపాడ. దీంతో ప్రదీప్ రంగనాథన్ ట్యాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

ఇక ఈ హీరో నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమాలపై ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రదీప్ నెక్స్ట్ చిత్రం LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) డిసెంబర్‌లో రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమా తర్వాత ప్రదీప్ మరోసారి మెగా ఫోన్ పట్టుకోనున్నాడు. తానే హీరోగా ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రదీప్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని డ్యూడ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్ తెలిపాడు. గతంలో స్టార్ హీరో విజయ్‌తో ఈ సినిమాను చేయాలని ప్రదీప్ భావించినా, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో ఇప్పుడు తానే హీరోగా, డైరెక్ట్ చేయనున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతోందా అని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

తాజా వార్తలు