విడుదల తేదీ : మే 16, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, ఆడుకలం నరేన్, రవివర్మ, అర్జై, కిరీటి దామరాజు
దర్శకుడు : లోకేశ్ అజ్ల్స్
నిర్మాతలు : అజ్మల్ ఖాన్ & రేయా హరి
సంగీత దర్శకుడు : డి.ఇమ్మాన్
సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ అశోక్
ఎడిటర్ : శ్రీకాంత్.ఎన్.బి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర నటించిన మరో థ్రిల్లర్ చిత్రం ‘లెవెన్’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
వైజాగ్ ప్రాంతంలో జరిగే కొన్ని సీరియల్ హత్యల కేసు పోలీస్ వారికి సవాల్ గా మారుతుంది. అయితే ఒకే ప్యాట్రన్ లో జరుగుతున్న ఈ హత్యల మిస్టరీని ఛేదించడానికి ఏసీపీ అరవింద్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇలా తాను ఎంటర్ అయ్యాక హత్య గావించబడ్డ బాడీల నుంచి ఒక లీడ్ ని కనుక్కుంటాడు. మరి ఈ లీడ్ తో తాను తెలుసుకున్న షాకింగ్ నిజం ఏంటి? ఈ హత్యలు అన్నీ ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వారికి ఉన్న కారణం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
గత వారమే ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పలకరించిన నవీన్ చంద్ర నుంచి ఇది మరో డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. దానికి దీనికి కూడా మళ్ళీ తనలోని వేరియేషన్ ని నవీన్ చక్కగా చూపించాడు. తన బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు లెవెన్ లో ఫ్రెష్ గా ఉంటుంది.
తన పాత్రలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించిన నవీన్ అంతే క్లారిటీ సినిమా అంతా మైంటైన్ చేసాడు. అలాగే కథనంలో వచ్చే పలు ట్విస్ట్ లు టర్నింగ్ లు మంచి ఎగ్జైటింగ్ గా కూడా అనిపిస్తాయి. అలాగే సెకండాఫ్ లో మూమెంటం బాగుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సహా ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా సినిమాలో బాగుంది. ముఖ్య నటులు శశాంక్, దిలీపన్ అలాగే అభిరామి తదితరులు మంచి నటన కనబరిచారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో డీసెంట్ లైన్ ఉన్నప్పటికీ కథనం మాత్రం స్లోగా సాగుతుంది. రన్ తక్కువే అయినప్పటికీ కూడా కథనం నడిచే తీరు చూస్తే అలా నెమ్మదిగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. మెయిన్ గా ఫస్టాఫ్ ని బాగా సాగదీసినట్టుగా అనిపిస్తుంది.
స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఫాస్ట్ పేస్ లో డిజైన్ చేసి ఉంటే ఈ థ్రిల్లర్ కి ఇంకా పనికొచ్చేది. అలాగే నవీన్ చంద్ర రోల్ ని కూడా ఇంకొంచెం బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. తన రోల్ చూసేందుకు సాలిడ్ గా కనిపిస్తాడు కానీ అది లో టోన్ లోనే మైంటైన్ చేయడం అంతగా వర్కౌట్ కాలేదు.
అలాగే ఇంకొన్ని థ్రిల్ మూమెంట్స్ సహా ట్విస్ట్ లు కూడా యాడ్ చేసేందుకు స్కోప్ ఉంది కానీ అది కూడా మిస్ అయ్యినట్టుగా అనిపిస్తుంది. వీటితో పాటుగా నిర్మాత సహా హీరోయిన్ రియా పాత్ర సినిమా అంత ఎఫెక్ట్ చూపించదు.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు ఇంకా బెటర్ గా ఉండాల్సింది. అలాగే ప్రొడక్షన్ డిజైన్ కూడా ఓకే. సంగీత దర్శకుడు డి ఇమాన్ సంగీతం బాగుంది. మెయిన్ గా కొన్ని సన్నివేశాల్లో ప్రభావం చూపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది.
ఇక దర్శకుడు లోకేష్ అజిస్ విషయానికి వస్తే.. తన క్లారిటీ అనేది ఇంప్రెస్ చేస్తుంది. డీసెంట్ లైన్ ని తాను మంచి క్లారిటీ తో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే దీనిని ఇంకొంచెం బెటర్ గా షేప్ అవుట్ చేసి ఉంటే ఈ థ్రిల్లర్ మరింత ఇంప్రెస్ చేసి ఉండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “లెవెన్” చిత్రంలో నవీన్ చంద్ర మంచి పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటాడు అలాగే మర్డర్ మిస్టరీ చుట్టూతా కనిపించే సస్పెన్స్ సహా పలు ట్విస్ట్ లు లాంటివి మంచి ఎగ్జైట్ చేస్తాయి. కాకపోతే కథనం ఇంకొంచెం ఫాస్ట్ గా డిజైన్ చేయాల్సింది. దర్శకుడు విజన్ కూడా బాగానే ఉంది. సో వీటితో కొంచెం ఓకే అనిపించే రేంజ్ థ్రిల్లర్ చిత్రాలు చూడాలి అనుకునేవారు తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team