ట్రైలర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా రష్మిక ‘గర్ల్ ఫ్రెండ్’

ట్రైలర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా రష్మిక ‘గర్ల్ ఫ్రెండ్’

Published on Oct 25, 2025 12:44 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో యువ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రమే “ది గర్ల్ ఫ్రెండ్”. ఇది వరకే వచ్చిన టీజర్ తో సాలిడ్ కంటెంట్ ని ప్రామిస్ చేసిన ఈ సినిమా నుంచి ఇప్పుడు దానికి మించి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కట్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

యువ జంట నడుమ ఒక ట్రై యాంగిల్ రిలేషన్ షిప్ అందులోని డిఫరెంట్ షేడ్స్ ని రాహుల్ రవీంద్రన్ ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం ఎంగేజ్ చేసేలా కనిపిస్తుంది అని చెప్పాలి. రష్మిక, అను ఎమ్మానుయేల్, దీక్షిత్ శెట్టి లు సాలిడ్ పెర్ఫామెన్స్ లు చూపించగా..

వెర్సటైల్ నటుడు రావు రమేష్ ఇంకా రష్మిక, దీక్షిత్ ల నడుమ కొన్ని సన్నివేశాలు మంచి హార్డ్ హిట్టింగ్ గా కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇందులో కట్స్ కానీ సంగీతం కానీ అంతే ఫ్రెష్ గా కనిపిస్తూ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. ఇక ఈ నవంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు