బాద్షా డబ్బింగ్ చెప్పిన నవదీప్

బాద్షా డబ్బింగ్ చెప్పిన నవదీప్

Published on Feb 28, 2013 12:29 PM IST

navdeep

నవదీప్ తొందరలో యంగ్ టైగర్ ఎన్.టి.అర్. సినిమా ‘బాద్షా’ లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. నవదీప్ తను చేసిన పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమాలో నవదీప్ నెగటివ్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. దీనిలో మెయిన్ విలన్ గా ముఖేష్ ఋషి నటించాడు. ఈ సినిమా దాదాపుగా ముగిసింది, ప్రస్తుతం పోస్ట్ – ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ మద్యనే ఎన్టీఆర్ యూరోప్ షెడ్యుల్ ముగించుకొని హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆడియో మార్చ్10న విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు