టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా రాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా ఒక సప్సెన్స్ థ్రిల్లర్ అట. నానికి ఈ సినిమా పూర్తిగా కొత్తగా ఉండబోతుందట. సెకెండ్ హాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని.. ముఖ్యంగా నాని క్యారెక్టర్ కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది.
అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని ఆగష్టు నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్ అండ్ మిగిలిన నటీనటుల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.
నాని ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాబోతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫరెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మరో డిఫరెంట్ క్యారెక్టర్‌లో చూపిస్తున్నాడు.