నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తోన్న కొత్త ప్రాజెక్ట్ ‘శ్యామ్ సింగ రాయ్’. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో సైన్ చేసిన ‘టక్ జగదీష్’ పూర్తికావడంతో ఈ సినిమాను పట్టాలెక్కించారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 2018లో ‘టాక్సీవాలా’ సినిమాతో పరిచయమైన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కోసం రాహుల్ దాదాపు రెండేళ్లు వెయిట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నాని క్యారెక్టర్ పై అనేక రూమర్స్ వచ్చాయి.
ఇందులో నాని తన గత సినిమాల్లో కంటే భిన్నంగా కనిపిస్తారని తెలుస్తోంది. అందుకే నాని క్యారెక్టర్ ను సీక్రెట్ గా ఉంచుతున్నారట. ఈ చిత్రంలో నానికి జోడీగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చిత్రీకరణలో నానితో పాటు కృతి శెట్టి పాల్గొంటోంది. కలకత్తా నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ ఎస్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.