ఆశ్చర్యపరిచేలా కనిపించనున్న నాని

ఆశ్చర్యపరిచేలా కనిపించనున్న నాని

Published on Feb 27, 2013 11:30 AM IST

Nani

హీరో నాని నటిస్తున్న’జెండా పై కపిరాజు’ సినిమాలో కొత్తగా అందరిని ఆశ్చర్యపరిచేలా కనిపించనున్నాడు. ఈ సినిమాలో నాని గుండుతో కనిపించానున్నాడని ఫిల్మ్ నగర్లో ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. దీనిలో ఒక పాత్రలో నెగిటివ్ గా కనిపించనున్నాడని సమాచారం. అమలా పాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పి.సముద్ర ఖణి దర్శకత్వం వహిస్తున్నాడు.

జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు 1న విడుదల కానుంది. ఇప్పటి వరకు నాని హెయిర్ స్టైల్ అన్ని సినిమాలో ఒకేవిధంగా ఉంది. కాని ఈ సినిమాలోని హెయిర్ స్టైల్ అందరిని ఆశ్చర్యపరిచేలా ఉండనుంది

తాజా వార్తలు