నేచ్యురల్ స్టార్ నాని ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’. ఏప్రిల్ 23న ఈ చిత్రం రిలీజ్ కానుంది. సినిమా చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటివరకు సినిమా నుండి పోస్టర్లు మినహా మరే అప్డేట్ లేదు. అందుకే ఈ నెల 24న నాని పుట్టినరోజు కావడంతో ఆ రోజున టీజర్ రిలీజ్ చేయనున్నారు టీమ్. గతంలో నాని, శివ నిర్వాణల కాంబినేషన్లో ‘నిన్ను కోరి’ లాంటి హిట్ సినిమా వచ్చి ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
ఇక ఇదే రోజున ఇంకో అప్డేట్ కూడ ఇవ్వనున్నారు నాని. అదే ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్. ఇప్పటివరకు ఈ సినిమాలో నాని లుక్ ఏంటో రివీల్ కాలేదు. చాలా గోప్యంగా ఉంచారు. ఎక్కడా వర్కింగ్ స్టిల్స్ కూడ బయటకు రానివ్వట్లేదు. ఎన్నిబట్టి సినిమాలో నాని లుక్ కొత్తగా ఉంటుందని అర్థమవుతోంది. నాని బర్త్ డే రోజునే ఆ లుక్ ఏంటో రివీల్ చేయనున్నారు చిత్ర బృందం. ఈ చిత్రాన్ని ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నానికి జోడీగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. సినిమా మొత్తం కలకత్తా నేపథ్యంలో ఉండనుంది.