నానికి రెండు పాన్ ఇండియా సినిమాల పోటీ.. ప్రభావం ఎలా ఉంటుందో?

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిత్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 1న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, నానికి వేసవి కష్టాలు తప్పేలా లేవు. నాని సినిమాతో పోటీ పడేందుకు మరో రెండు పాన్ ఇండియా సినిమాలు రెడీ అయ్యాయి. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ కానుంది. అటు తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘రెట్రో’ చిత్రం కూడా మే 1న రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ రెండు చిత్రాలు కూడా నాని ‘హిట్-3’ మూవీపై ప్రభావం చూపుతాయని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ రెండు సినిమాలు నాని హిట్ పరంపరకు ఎంతమాత్రం ప్రభావం చూపిస్తాయో చూడాలి.

Exit mobile version