నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఈసారి అలాంటిదా..?

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఈసారి అలాంటిదా..?

Published on Sep 17, 2025 3:00 AM IST

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైస్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుండగా, షూటింగ్ కొత్త సంవత్సరం ఆరంభంలోనే పూర్తవుతుంది. దీని తర్వాత నాని, సుజీత్ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 చివర్లో విడుదల కానుంది.

ఇక ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి కూడా నాని ఓకే చెప్పాడు. శౌర్యువ్ చెప్పిన ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథ నానిని ఆకట్టుకోవడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం, దర్శకుడి గత సినిమా కంటే పూర్తిగా విభిన్నమైన జానర్‌లో రానుంది.

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన సంక్రాంతి 2026లో వెలువడే అవకాశం ఉంది. షూటింగ్ మాత్రం నాని-సుజీత్ సినిమా పూర్తయ్యాక మొదలుకానున్నట్లు తెలుస్తోంది. మరి నాని ఈసారి ఎలాంటి పీరియాడిక్ కథతో వస్తాడో చడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు