‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ పై కసరత్తులు !

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ పై కసరత్తులు !

Published on Nov 2, 2025 3:59 PM IST

Andhra-King-Taluka

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 28, 2025న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఐతే, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రెడీ చేస్తునట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్.. గ్రాండ్ విజువల్స్ తో పాటు రామ్ క్యారెక్టర్ ఎలివేషన్ అండ్ లవ్ స్టోరీ తాలూకు సాలిడ్ బిజీఎమ్ కూడా ఈ ట్రైలర్ లో హైలైట్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా ట్రైలర్ లో రామ్ – భాగ్యశ్రీ బొర్సె మధ్య కెమిస్ట్రీ అండ్ ఎమోషన్ కూడా చాలా ఆకట్టుకుంటుందట. కాగా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, వీటీవీ గణేష్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

తాజా వార్తలు