నాని మరియు అమలాపాల్ త్వరలో ఒక చిత్రం కోసం కలిసి పని చెయ్యనున్నారు. “శంభో శివ శంభో” మరియు “సంఘర్షణ” చిత్రాలకు దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. నాని మరియు అమల పాల్ తో పాటు ఈ చిత్రంలో జయం రవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో మొదలు కానుంది. రాధా మోహన్ “గౌరవం” మరియు రవి తేజ “సార్ వస్తారు” చిత్రం నుండి అమల పాల్ ని తప్పించాక ఈ భామ ఒప్పుకున్న చిత్రం ఇది. ఆ చిత్రాల నుండి డేట్స్ లేని కారణంగా తప్పుకున్నానని అమల పాల్ చెప్పారు. త్వరలో వి వి వినాయక చిత్రంలో పాల్గొనేందుకు అమల పాల్ యు కే వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా నాని “ఈగ” మరియు “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రాలు విడుదల కోసం వేచి చూస్తున్నారు.