2014లో నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం చేయనున్నాడా?


తాజా సమాచారం ప్రకారం నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా 2014లో అరంగేట్రం చేయనున్నాడనే వార్తలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. ఈ రోజు జరుగుతున్న ‘శ్రీమన్నారాయణ’ ఆడియో వేడుకకి బాలకృష్ణ తో పాటు నందమూరి మోక్షజ్ఞ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో యాంకర్ గా వ్యవహరించిన ఉదయ భాను నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి తెలియజేయడంతో మేము విన్న విషయం ఖచ్చితమైనది.

త్వరలోనే నందమూరి మోక్షజ్ఞ మార్షల్ ఆర్ట్స్ మరియు డాన్సులు నేర్చుకోవడానికి లండన్ వెళ్లనున్నారు. కానీ అతని ఎంట్రీ మాత్రం 2014లో ఉంటుంది. ప్రస్తుతానికి అంతకు మించిన విషయాలు ఏమి తెలియలేదు, కానీ నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఆసక్తికరమైన విషయం.

Exit mobile version