తాజా సమాచారం ప్రకారం కింగ్ నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా అక్టోబర్ 4 న విడుదలకానుంది. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఈ 20 న జరగనుంది. ఇప్పటికే ఈ సినిమా టాకీ భాగం ముగించుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ ను ముగించుకున్న ఈ సినిమా ఆ పాటను ఈ నెల 13, 14 మరియు 15వ తేదిలలో పూర్తిచేసుకుంటుంది
ఈ సినిమాలో పక్కా మాస్ పాత్రలో నాగార్జున కనువిందుచెయ్యనున్నారు. వీరభద్రం చౌదరి దర్శకుడు. రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. ఈ చిత్రాన్ని రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విడుదలచెయ్యనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు