25న నాగార్జున భాయ్??

25న నాగార్జున భాయ్??

Published on Oct 12, 2013 11:40 AM IST

bhai-release-date-confirmed
‘కింగ్’ నాగార్జున నటించిన నూతన చిత్రం ‘భాయ్’ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి విడుదలకు సిద్ధంగావుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెల 25న విడుదలకానుంది. అయితే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. త్వరలోనే అధికారికంగా తెలిపే అవకాశం వుంది.

‘భాయ్’ సినిమాలో నాగార్జున మరియు రీచా గంగోపాధ్యాయ్ ప్రధానపాత్రలు పోషించారు. వీరభద్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ సౌజన్యంతో నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సీమంధ్రలో అల్లర్లు, గొడవలు కాస్త సద్దుమనగడంతో నిర్మాతలు తమ తమ సినిమాలను విడుదల చెయ్యడానికి మగ్గుచూపుతున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు