అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’లో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జునతో ఆ సినిమాకి సీక్వెల్ తీయబోతున్న సంగతి కూడా తెలిసిందే. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని అక్టోబర్ లోపు పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట.
ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. ఎలాగూ ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఇక అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ఐఏ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇది నాగర్జున గతంలో చేసిన యాక్షన్ చిత్రాలకంటే భిన్నంగా ఉంటుందట. ఇందులో బాలీవుడ్ బ్యూటీలు సయామీ ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.