స్పెయిన్ లో తన రేసింగ్ టీంని ప్రోత్సాహించనున్న నాగార్జున

స్పెయిన్ లో తన రేసింగ్ టీంని ప్రోత్సాహించనున్న నాగార్జున

Published on Feb 26, 2013 4:03 AM IST

Nagarjuna

‘కింగ్’ నాగార్జునకి బైక్ ల పట్ల, కార్ల పట్ల వున్న ఇష్టం అందరికి తెలిసిందే. సినిమాలలో నటించడమే కాకుండా ఆయన ఎన్నో వ్యాపారాలలో గత పదేళ్ళుగా చురుగ్గా పాల్గొంటున్నారు. వాటిలో ఒకటి సూపర్ బైక్ రేసింగ్ టీం (మహి రేసింగ్ టీం ఇండియా కవాసాకి). నాగార్జున ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ధోని మరియు నందిష్ దొమ్లర్ తో పాటు సహయజమానిగా వ్యవహరిస్తున్నారు. గత నవంబర్లో ప్రారంభమైన ఈ సంస్థ దిగ్విజయంగా నిర్వహింపబడుతుంది. ఇటివలే ఆస్ట్రేలియా ఫిలిప్ ఐలాండ్ లో నిర్వహింపబడిన పోటిలో ఒక పెద్ద రేస్ ని కూడా గెల్చుకుంది. తమ డ్రైవర్లలో ఒకరు ఈ పోటీలో మొదటి స్థానంలో నిలబడ్డారని తెల్సుకున్న నాగార్జున సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారని వినికిడి. తనే స్వయంగా ఏప్రిల్ లో స్పెయిన్ వెళ్లి తన టీంని తర్వాతి రేస్ లకి వారిని ప్రోత్సాహించాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం నాగార్జున ‘భాయ్’ చిత్ర షూటింగ్లో బిజీగా వున్నారు. ఈ చిత్రానికి వీరభద్రం చౌదరి దర్శకుడు. నాగార్జున నిర్మాత. దశరథ్ దర్శకత్వం వహించిన ‘గ్రీకువీరుడు’ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతోంది.

తాజా వార్తలు