టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన కింగ్ నాగార్జున నటించిన గత సినిమాలు కొన్ని ఆశించిన విజయాన్ని అందించక పోవడంతో ఇప్పుడు ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం నాగార్జున చేతిలో ‘మనం’ తప్ప మరో సినిమా లేదు.
తాజా ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ‘స్వామి రారా’ డైరెక్టర్ సుధీర్ వర్మకి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మ నాగార్జునని కొత్తగా చూపిస్తాడని ఆశించవచ్చు. ఇవి కాకుండా మరో రెండు మల్టీ స్టారర్ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
అందులో ఒకటి మణిరత్నం దర్శకత్వంలో మహేష్ బాబు, నాగార్జున నటించబోయే సినిమా అయితే రెండవది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, నాగార్జున నటించబోయే సినిమా. ఈ రెండు సినిమాలపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.