స్పెషల్ చబ్బిస్ రీమేక్ నేను చెయ్యట్లేదు : నాగార్జున

స్పెషల్ చబ్బిస్ రీమేక్ నేను చెయ్యట్లేదు : నాగార్జున

Published on Feb 26, 2013 9:21 PM IST

Nagarjuna
అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ చబ్బిస్ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు మల్టిప్లెక్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న ఈ సినిమాని నాగార్జున తెలుగులో చేయబోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. దీనిపై నాగార్జున మాట్లాడుతూ ఈ రూమర్ ఎలా వచ్చిందో తెలియదు కానీ ‘స్పెషల్ చబ్బిస్’ రీమేక్ నేను చెయ్యట్లేదు, ఆ సినిమా కూడా నేను చూడలేదని అన్నారు. ఈ సినిమా చుసిన చాలామంది మీరు చేస్తే బావుంటుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఆ ఐడియా లేదు. భవిష్యత్తులో చూద్దాం అని అన్నారు. నాగార్జున ప్రస్తుతం గ్రీకువీరుడు, భాయ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు