వర్షంలో ఫైట్స్ చేస్తున్న నాగ చైతన్య


అక్కినేని నాగ చైతన్య మరియు కామెడీ హీరో సునీల్ అన్నదమ్ములుగా ఒక మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతోంది. తమిళంలో విజయం సాదించిన ‘వేట్టై’ చిత్రానికి ఇది రిమేక్. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రామ్ – లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో వర్షం ఎఫెక్ట్ లో నాగ చైతన్య మీద ఒక ఫైట్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య – సునీల్ నటన ఆద్యంతం కామెడీగా సాగుతూ అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన తమన్నా మరియు సునీల్ సరసన ఆండ్రియా జేరేమియా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version