చైతూ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ కోసం తన బ్లాక్ బస్టర్ దర్శకుడు?

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన నాగ చైతన్య రీసెంట్ గా “తండేల్” సినిమాతో సూపర్ హిట్ అందుకొని సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత యంగ్ దర్శకుడు కార్తీక్ వర్మ దండు కలయికలో చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇది చైతు కెరీర్ 24వ సినిమా కాగా దీని తర్వాత తన కెరీర్ ల్యాండ్ మార్క్ చిత్రం 25వ సినిమా పట్ల లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం చైతు కోసం తన బ్లాక్ బస్టర్ దర్శకుడు వర్క్ చేయనున్నట్టు తెలుస్తుంది. మజిలీ లాంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ చైతు 25వ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయనున్నారట. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక కార్తీక్ వర్మ దండు ప్రాజెక్ట్ ప్రస్తుతం భారీ బడ్జెట్ తో అంతే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version