వర్కింగ్ డే నైజాంలో ‘కుబేర’ స్టడీ వసూళ్లు.. డే 4 ఎంతంటే!

టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా రష్మిక మందన్నా కింగ్ నాగార్జునలు ఇంట్రెస్టింగ్ పాత్రల్లో మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ ఇంట్రెస్టింగ్ చిత్రమే “కుబేర”. అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని సాధించిన ఈ చిత్రం ముఖ్యంగా తెలుగులో చేస్తుంది. ఒక సాలిడ్ వీకెండ్ తర్వాత కీలక వర్కింగ్ డే సోమవారం కూడా మంచి వసూళ్లు ఈ చిత్రం రిజిస్టర్ చేయడం అనేది విశేషం.

ఇలా నైజాంలో కుబేర నాలుగో రోజు స్ట్రాంగ్ వసూళ్లు నమోదు చేసినట్టు పిఆర్ లెక్కలు చెబుతున్నాయి. 1.4 కోట్ల షేర్ (జీఎస్టీ కలిపి) ని నైజాంలో కుబేర రాబట్టి ఒక స్టడీ పెర్ఫామెన్స్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఇలా మొత్తం 4 రోజుల్లో కుబేర సినిమా 11 కోట్ల మేర షేర్ ని అందుకోవడం విశేషం. ఇది ధనుష్ కెరీర్లోనే కాకుండా రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో కూడా సాలిడ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ రన్ లో కుబేర ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి.

Exit mobile version