సర్ప్రైజింగ్ పోస్టర్ తో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కొత్త సీజన్ వచ్చేస్తుంది!

మన ఇండియన్ ఓటిటి కంటెంట్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యిన పలు క్రేజీ వెబ్ సిరీస్ లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చిన సాలిడ్ థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి. రెండు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా మనోజ్ బాజ్ పాయితో తెరకెక్కించిన దర్శకుడు రాజ్ అండ్ డీకేల నుంచి ఇపుడు సీజన్ 3 ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.

ఈ సిరీస్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉండగా మొత్తానికి సీజన్ 3 కోసం ఎదురు చూస్తున్న వారికి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ ని ఇచ్చేసారు. దీనితో అత్తో త్వరలోనే ది ఫ్యామిలీ మ్యాన్ 3 ట్రీట్ ఇచ్చేందుకు వస్తుంది అంటూ మనోజ్ పై ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ అప్డేట్ ని ఇచ్చేసారు. అయితే దీనికి ది ఫ్యామిలీ మ్యాన్ రిటర్న్స్ అంటూ కొత్త టైటిల్ ని లాక్ చేయడం విశేషం. ఇక డేట్ ఎప్పుడు వస్తుంది అనేది తర్వాతి ప్రశ్నగా మారింది. ఇప్పుడు ఫ్యాన్స్ దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version