మన టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన మరో లాంగ్ అవైటెడ్ చిత్రమే “కుబేర”. సినిమా సినిమాకి గ్యాప్ తీసుకొని వచ్చే శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రం ఇప్పుడు భారీ వసూళ్లు సొంతం చేసుకొని అదరగొడుతుంది. అయితే ఈ చిత్రం చూసిన తెలుగు ఆడియెన్స్ సహా సినీ ప్రముఖులు అంతా కూడా ఎంతో మెస్మరైజ్ అయ్యారు.
ఇక ఇలా శేఖర్ కమ్ముల ఇచ్చిన క్లాసిక్ హిట్ చిత్రాల్లో ఒకటైన తన ‘గోదావరి’ హీరో సుమంత్ నుంచి ఇంట్రెస్టింగ్ రివ్యూ ఇప్పుడు వచ్చింది. ‘చాలా అంచనాలు పెట్టుకొనే ఈ సినిమాకి వెళ్లాను ఆ అంచనాలు అన్నిటినీ ఈ చిత్రం అందుకుంది. టాప్ పెర్ఫామెన్స్ లతో ఎంతో ఎంగేజింగ్, ఎమోషనల్ గా కుబేర యునిక్ గా ఉంది. అందరికీ కంగ్రాట్స్’ అంటూ సుమంత్ కుబేర చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు అంటూ ట్యాగ్ చేసి తన డైరెక్టర్ సినిమాపై ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ ని అందించారు.