కన్నప్ప: కంటెంట్ మీదే మొత్తం నమ్మకం!

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్న అవైటెడ్ చిత్రాల్లో ఈ వారం థియేటర్స్ లో ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిర్రమ్ “కన్నప్ప” కూడా ఒకటి. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ అవైటెడ్ సినిమా విషయంలో ఓ టాక్ వైరల్ గా మారింది. ఈ చిత్రానికి బిజినెస్ పరంగా కొన్ని కామెంట్స్ విస్తృతంగా వినిపిస్తున్నాయి.

దాదాపు ఓన్ రిలీజ్ లోనే ఈ సినిమా వస్తుంది అని అలాగే ఓటిటి డీల్ పరంగా కూడా కాలేదని తెలిసిందే. అయితే వీటిని కొందరు వేరేలా ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ నిజానికి మేకర్స్ అనుకున్న రేంజ్ రేట్ రాని కారణంగా మాత్రమే ఈ సినిమా ఓన్ రిలీజ్ ఇంకా ఓటిటి డీల్ ని లాక్ చేసుకోలేదని తెలియకపోవచ్చు. ఆ మధ్య విష్ణు కూడా ఓటిటి డీల్ కి ఒక రేట్ తాను చెప్తే ఓటిటి వారు ఇంకో రేట్ చెప్పారు.

సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే తాను చెప్పిన మొత్తం ఇస్తామని చెప్పారని నేను ఆ మొత్తం రెడీ చేసుకోండి అని చెప్పానని తెలిపాడు. మరి ఇదే థియేట్రికల్ గా కూడా అని చెప్పొచ్చు. వీటితో తాము కంటెంట్ పరంగా ఎంత నమ్మకంగా ఉన్నారు అనేది అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ ట్రైలర్ కి మంచి టాక్ వచ్చింది. సో థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక అన్నీ వర్కౌట్ అయితే కన్నప్ప సాలిడ్ వసూళ్లు అందుకోవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

Exit mobile version