మైత్రీ నిర్మాతల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే !

మైత్రీ నిర్మాతల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే !

Published on Feb 12, 2021 3:00 AM IST


తెలుగు పరిశ్రమల్లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. నవీన్ యార్నేని, యలమంచిలి రవిశంకర్ కలిసి ప్రారంభించిన ఈ నిర్మాణ సంస్థ ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. మొదటి సినిమాగా మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మైత్రీ మూవీస్ ఆ తర్వాత వరుసగా ‘రంగస్థలం, జనతా గ్యారేజ్’ లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించింది. ‘చిత్రలహరి, మత్తువదలరా’ లాంటి డీసెంట్ హిట్లు వీరి ఖాతాలో ఉన్నాయి.

మైత్రీ నుండి సినిమా వస్తుంది అంటే మంచి సినిమానే అయ్యుంటుందనే నమ్మకం ఏర్పరచుకుంది ఈ సంస్థ. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాణంలో ఉన్న, నిర్మాణంలోకి వెళ్లనున్న పెద్ద సినిమాల్లో సగం వీరి నిర్మిస్తున్నవే. ఈ సంస్థలో నిర్మితమైన ‘ఉప్పెన’ రేపు రిలీజ్ కానుండగా ‘సర్కారు వారి పాట, పుష్ప’ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ చిత్రం, నాని సైన్ చేసిన ‘అంటే సుందరానికి’ త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్నాయి.

ఇంకా మెగాస్టార్ చిరంజీవి, బాబీల చిత్రం, బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్, విజయ్ దేవరకొండ, శివ నిర్వాణల చిత్రం, ప్రభాస్ హీరోగా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ వంటివి భవిష్యత్తులో చేయడానికి వీరు కన్ఫర్మ్ చేసుకున్న చిత్రాలు. దాదాపు అందరు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు మైత్రి నిర్మాతలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు