నా జీవితంలో మరపురాని రోజులవే అంటున్న కాజల్

నా జీవితంలో మరపురాని రోజులవే అంటున్న కాజల్

Published on Feb 25, 2013 4:50 PM IST

Kajal-Agarwal

టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోలతోనే కాకుండా బాలీవుడ్ ఇద్దరు టాప్ హీరోలతో సినిమాలు చేసి ప్రస్తుతం కెరీర్లో బిజీగా ఉన్న అందాల భామ కాజల్ అగర్వాల్ ఒక్కసారి సినిమా షూటింగ్ ల నుంచి బయటకొచ్చి తన జీవితంలోని మరపురాని రోజుల గురించి చెప్పింది. ‘ నా జీవితంలో మరపురాని మధురమైన రోజులు ఏమన్నా ఉన్నాయి అంటే అవి కాలేజీ రోజులే. ఎందుకంటే సినిమాలు నాకు పేరు, పలుకుబడి తెచ్చి పెట్టినా నాకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరిచింది మాత్రం కాలేజీ రోజులేనని’ తన తీపి గుర్తులను నెమరు వేసుకుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఎన్.టి.ఆర్ సరసన ‘బాద్షా’ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా మరో తెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది.

తాజా వార్తలు