“వకీల్ సాబ్”కు గట్టిగానే కష్టపడుతున్నారు.!

“వకీల్ సాబ్”కు గట్టిగానే కష్టపడుతున్నారు.!

Published on Feb 20, 2021 9:00 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “వకీల్ సాబ్” విడుదలకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ గ్యాప్ లో చిత్ర యూనిట్ శరవేగంగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే ఈ చిత్రానికి గాను ఇంకా చాలా వరకునే మ్యూజికల్ మిక్సింగ్ పనులు బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ పనులను సంగీత దర్శకుడు థమన్ అండ్ యూనిట్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అందుకు గాను అర్ధ రాత్రి సమయం వరకు తన టీం తో గట్టిగా కష్టపడుతున్నట్టుగా చెబుతున్నాడు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ సినిమా ఆడియో ను పూర్తి చేస్తున్నట్టుగా థమన్ తెలిపాడు.

అయితే ఈ చిత్రం ఆల్బమ్ విషయంలో కూడా మొదటి నుంచీ చాలా నమ్మకంగా ఉన్నాడు. పవన్ చేసిన ఇంతకు ముందు హిట్ ఆల్బమ్స్ లో ఇది కూడా నిలుస్తుంది అని చెప్పాడు. మరి ఈ సినిమా ఆల్బమ్ ఎలా ఉందో తెలియాలి అంటే వచ్చే మార్చ్ వరకు ఆగాల్సిందే. ఇక దిల్ రాజు నిర్మాణం వహించిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు