పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఐతే, ‘స్పిరిట్’ మూవీపై మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ క్రేజీ కామెంట్స్ చేశారు. డార్లింగ్ అంటే తనకు అభిమానమని, అందుకే ఈ చిత్రం కోసం కసిగా పనిచేస్తున్నట్లు హర్షవర్ధన్ రామేశ్వర్ చెప్పుకొచ్చారు. అద్భుతమైన సంగీతం అందిస్తానని హర్షవర్ధన్ చెప్పారు. ప్రస్తుతం సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని హర్షవర్ధన్ రామేశ్వర్ తెలిపారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్కొన్నారు. ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే..ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది. అన్నట్టు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమా కోసం ఇప్పటికే సాంగ్స్ ను కంపోజ్ చేయడం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.