డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన మొదటి సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసి డైరెక్టర్ గా తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత తన దైన స్టైల్లో మరియు చాలా వేగంగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయారు. పూరి జగన్నాథ్ ఇప్పటివరకూ దాదాపు పెద్ద హీరోలందరితోనూ సినిమాలు చేసారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ పూరి – పవన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆయన ఒక ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఇప్పటివరకూ పాతిక సినిమాలు తీసారు, ఈ జర్నీలో సినిమా గురించి ఏమి తెలుసుకున్నారు? అని అడిగితే దానికి పూరి సమాధానమిస్తూ ‘ ఏం తెలుసుకున్నా ఏమీ తెలుసుకోలేదు. సినిమా అంటే ఇది, ఇలా తీస్తే సినిమా హిట్ అవుతుందని ఎవరికీ తెలియదు. నా వరకూ సినిమా అంటే ఓ జోక్.! అది విని అందరూ బాగా నవ్వితే హిట్ లేకపోతే ప్లాప్’ అని ఆయన అన్నారు. పవన్ తో తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా రేపు విడుదల కానుండగా, అప్పుడే పూరి అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’ అనే సినిమాని మొదలు పెట్టేసారు. ఈ రోజు ఉదయం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరుపుకొని లాంచనంగా ప్రారంభమైంది .