‘జైలర్-2’లో జాయిన్ అయిన మలయాళ సూపర్ స్టార్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘జైలర్-2’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ సినిమాలో పలువురు స్టార్స్ కూడా నటిస్తున్నారు.

జైలర్ చిత్రంలో నటించిన వారిలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, మరోసారి ‘జైలర్ 2’లో సందడి చేయనున్నారు. దీని కోసం ఆయన జైలర్-2 చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఆయన దృశ్యం-3 చిత్రాన్ని ప్రారంభిస్తారు. అంతకంటే ముందు, జైలర్-2 షూటింగ్ ముగించుకోవాలని ఆయన భావిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూడా ఓ క్యామియో రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version