ఎన్నికల సమయం ఆసన్నమయ్యే సరికి ప్రతీ ఒక్కరూ తమతమ పార్టీలను, అభ్యర్ధులను ఎంచుకుని వారివెనుక పడే క్రమంలో వున్నారు. సినిమా రంగంలో వారికి కూడా ఇది మినహాయింపుకాదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాగార్జునలు మోడిని ని కలిసి తమ మద్దతుని ప్రకటించారు. ఇప్పుడు మరికొంతమంది నటులు అదే దారిలో పయనించనున్నారని సమాచారం
ఈ వార్తలన్నీ విని మంచు వారి కుటుంబంకూడా ఒక రాజకీయ పార్టీలో చేరుతుంది అని వార్తలొచ్చాయి. కానీ వీటిని ఆ కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. కొన్ని టి.వి చానళ్లలో మా రాజకీయ ప్రవేశం అంటూ ఊహాగానాలు వినిపించాయి. నేను అందరిలాంటి వాడిని కాను అని మోహన్ బాబు తెలిపారు
మంచు లక్ష్మి సైతం తనకు నరేంద్ర మోడీ అంటే ఇష్టమని, ఈ ఎన్నికలలో నేనేమి పోటీ చెయ్యట్లేదు అని. కానీ ఆయనకు మాత్రం నా మద్దతు అని తెలిపింది. అంతేకాక సినిమా రంగంనుండి మొదటిసారిగా ఆయనని కలిసింది మా కుటుంబమే నని చెప్పుకొచ్చింది
ఇకపై ఎన్ని పార్టీలకు మనవాళ్ళు ఎంతమంది సపోర్ట్ ని ఇస్తారో వేచి చూడాలి