కలెక్షన్ కింగ్ డా మోహన్ బాబు సెన్సార్ మీద చాలా కోపంగా ఉన్నారు విష్ణు మంచు హీరోగా రాబోతున్న “దేనికయినా రెడీ” చిత్రం కొద్ది రోజుల క్రితం సెన్సార్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం ఎల్లుండి విడుదల అవ్వాల్సి ఉండగా ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా అందలేదు. ఇదే మోహన్ బాబు గారి ఆగ్రహానికి కారణం అయ్యింది.
సెన్సార్ బోర్డ్ చీఫ్ అయిన ధనలక్ష్మి ఈ చిత్రాన్ని మరోసారి రేట్ చెయ్యాలని అనుకుంటున్నారు కాబట్టి ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వడాన్ని వాయిదా వేశారు. దీనివలన ఈ చిత్ర విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్యతో ఆగ్రహించిన నిర్మాతలు సెన్సార్ బోర్డ్ మీద అందులోనూ ప్రత్యేకంగా అధికారి మీద న్యాయపరమయిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. “ఈ సెన్సార్ మెంబర్ చేసేది బ్లాక్ మెయిల్” అని మోహన్ బాబు అన్నారు.
విష్ణు మంచు కూడా దీని మీద స్పందిస్తూ ” సెన్సార్ వారు చేస్తున్నది దారుణం ఇది నిజంగా బ్లాక్ మెయిల్ దీని మీద నేను పోరాడబోతున్నాను” అని అన్నారు. ఇంకా సెన్సార్ వారి నుండి ఎటువంటి సమాచారం అందలేదు అందగానే మీకు తెలియజేస్తాం మోహన్ బాబు మరియు మంచువిష్ణు ఈ వివాదాలన్నీ వెరసి చిత్రం 24న విడుదల అవుతుందని ఆశిస్తున్నారు.