మెగాస్టార్ కు డైలాగ్ కింగ్ ఫస్ట్ గిఫ్ట్ ఇదేనట.!

మెగాస్టార్ కు డైలాగ్ కింగ్ ఫస్ట్ గిఫ్ట్ ఇదేనట.!

Published on Aug 23, 2020 2:06 PM IST

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎందరో సీనియర్ హీరోల నడుమ మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో అతి కీలకమైన వారు మెగాస్టార్ చిరంజీవి మరి డైలాగ్ కింగ్ మోహన్ బాబులు అని చెప్పాలి. వీరిద్దరికి కనపడని దూరం ఉందని చాలా మంది అనుకుంటారు కానీ నిజ జీవితంలో ఒకరిపట్ల ఒకరు చాలా ప్రేమానురాగాలను పంచుకుంటారు.

అయితే నిన్ననే మెగాస్టార్ చిరు పుట్టినరోజు కావడంతో మోహన్ బాబు చిరుకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలను తెలిపారు. కానీ ఇప్పుడు శుభాకాంక్షలతో పాటుగా చిరుకు మొట్ట మొదటి సారిగా ఒక గిఫ్ట్ ను కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా చిరుని తెలిపారు. “నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి…” అని ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు