“కులు మనాలి” చిత్రం తరువాత తెలుగు తెర మీద కనుమరుగయిన నటి విమలా రామన్. ఈ భామ ఈరోజు ఆశ్చర్యకరంగా ఒక హిందీ చిత్రం ఒప్పుకుంది “ముంబై మిర్రర్” చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది. ఇటీవలే ఈ భామ చేసిన మలయాళ చిత్రం “డ్యాం 999” బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టకపోయినా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ భామ బాలివుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. హిందీలో ముంబై మిర్రర్ చిత్రం ఈ భామ కి రెండో చిత్రం కానుంది గతంలో “ఆఫ్ర తఫారి” అనే చిత్రం ఒప్పుకుంది ఈ చిత్రం చిత్రీకరణ మొదలయ్యింది అని విమలా రామన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.ఈసారయిన తన అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి.