లవ్లీ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న వెన్నెల కిషోర్

లవ్లీ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న వెన్నెల కిషోర్

Published on Jan 18, 2012 2:21 AM IST

ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్ “లవ్లీ” చిత్రం లో తన పాత్రకు డబ్బింగ్ ఇవ్వటం మొదలు పెట్టారు. ఇందులో ఆయనది మంచి పాత్ర అని చాలా బాగా వచ్చింది అని వర్గాలు చెబుతున్నాయి ప్రముఖ నటుడు డైలాగు కింగ్ సాయికుమార్ తనయుడు ఆది నటిస్తున్న ఈ చిత్రానికి బి.జయ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. శబ్దాలయ స్టూడియోస్ లో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది ఫిబ్రవరి లో విడుదల కానున్న ఈ చిత్రం లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు రాహుల్ దేవ్ , పరుచూరి గోపాల కృష్ణ , తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్ మరియు సత్యా కృష్ణ మిగిలిన పాత్రలలో నటిస్తున్నారు ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు