త్రిష కొద్దిరోజులు సెలవు తీసుకోనుంది. మే 4 న త్రిష పుట్టిన రోజు కూడా కావడంతో ఈ సెలవులకి త్రిష స్నేహితులతో కలిసి గడపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ” నేను సెలవు తీసుకోబోతున్నాను ముందస్తు శుభాకాంక్షలకు కృతజ్ఞతలు ” అని త్రిష ట్విట్టర్ లో తెలిపారు. త్రిష నటించిన చిత్రం “దమ్ము” ఈ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుతుంది ఈ చిత్రం భారీ విజయం సాదించాలని త్రిష కోరుకుంటుంది. పరశురాం దర్శకత్వం లో “సార వస్తారు” చిత్రం లో రవి తేజ సరసన మరియు జీవ సరసన మరో చిత్రం లో కన్పించనున్నారు.